Ajith Kumar: అజిత్ 62వ మూవీలో హీరోయిన్ ఎవరంటే?
అటు టాలీవుడ్ లో గాని, ఇటు కోలీవుడ్ లో గాని హీరో అజిత్ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ తన వయసుకు తగ్గ పాత్రలు, కథలను ఎంచుకుంటూ వరస మూవీస్ తో అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. అయితే కొద్ది కాలంగా సోషల్ మీడియాలో ఆయన పక్కన సినిమాలో చేసే హీరోయిన్స్ విషయంలోనే మార్పులు జరుగుతున్నాయి.
తన పక్కన నటించే హీరోయిన్ విషయం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి డిసైడ్ చేస్తున్నాడు అజిత్. అజిత్ చేసినా మూవీస్ లో “వివేకం”మూవీలో కాజల్ అగర్వాల్ ని సెలెక్ట్ చేశారు.”విశ్వాసం”మూవీలో నయనతార ని సెలెక్ట్ చేశారు. అలాగే”వలిమై”మూవీలో బాలీవుడ్ కి చెందిన హీరోయిన్ హూమా ఖురేషి అజిత్ పక్కన హీరోయిన్గా చేశారు.
రీసెంట్ గా అజిత్ నటించిన మరో కొత్త మూవీ”తుణివు”. ఈ మూవీలో మలయాళం హీరోయిన్ మంజు వారియర్ హీరోయిన్గా చేసింది. ఈ హీరోయిన్స్ అంతా కూడా సీనియర్ హీరోయిన్సే.తుణివు మూవీ విజయం సాధించిన తర్వాత ఇదే ఉత్సాహంతో అజిత్ తన 62వ మూవీ చేయనున్నాడు.
మరి ఈ మూవీకి నయనతార భర్త విగ్నేష్ శివన్ డైరెక్షన్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని రూపొందిస్తుంది. అలాగే ఈ మూవీకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ పనులు వచ్చే నెల ప్రారంభమవుతున్నట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ మూవీలో అజిత్ పక్కన హీరోయిన్గా చేసే వ్యక్తి ఎవరు అనేది ప్రస్తుతం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇంతకుముందు ఈ మూవీలో నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర ఆమె స్థాయికి తగ్గట్టుగా లేదని నయనతార చేయడం లేదని కూడా ప్రచారం జరిగింది. నయనతార తర్వాత ఈ మూవీలో త్రిష హీరోయిన్గా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.
తాజా సమాచారం ప్రకారం త్రిష ఈ మూవీలో చేయడం లేదని తెలిసింది. రీసెంట్ గా అజిత్ పక్కన ఐశ్వర్యారాయ్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.తాజాగా ఈ మూవీలో అజిత్ పక్కన నటించే హీరోయిన్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రీసెంట్ గా సాయి పల్లవి పేరు బయటకు వచ్చింది.ఇదంతా పక్కన పెడితే నిజానికి ఈ సినిమాకి ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేశారో ఇప్పటివరకు సినీ వర్గాలు ఇంకా బయటికి అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.
ఒకవైపు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ పనులు ప్రారంభం చేయడానికి టైం దగ్గర పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సినీవర్గాలు హీరోయిన్ సెలెక్ట్ చేశారా? సెలెక్ట్ చేసి ఉంటే ఎందుకు ఆ విషయాన్ని ఇప్పటివరకు సస్పెన్స్ లో ఉంచారు అంటూ కోలీవుడ్ లో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.