Viral Video: జంతువులతో సెల్ఫీ ఎంత ప్రమాదకరమో మీరే చూడండి

సెల్ఫీ పిచ్చిలో పడి కొంతమంది కుర్రాళ్ళు ఉజ్వలమైన భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. ప్రాణాంతకం అని తెలిసినా కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్ లో ప్రొఫైల్ గా పెట్టుకోవడానికి ఎంతో రిస్క్ చేసి మరి ఫోటోలు దిగుతున్నారు. అదృష్టం బాగుంటే బతికి బయటపడుతున్నారు కానీ లేకుంటే సెల్ఫీ పిచ్చిలో ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు.

ఏనుగులతో సెల్ఫీ దిగుతున్న యువకులు

సరిగ్గా ఇలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కారులో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు మార్గంమధ్యలో ఓ ఏనుగుల గుంపు కనిపించాయి. ఏనుగుల గుంపు కనిపించిన వెంటనే కారు ఆపేసి ఏనుగులతో కలిసి సెల్ఫీ దిగాలని ప్రయత్నించారు. ఫస్ట్ సెల్ఫీ దిగడం ఇష్టం లేట్టు ముఖాన్ని ఏనుగులు పక్కకు తిప్పుకున్నాయి.

అయినా సరే సెల్ఫీ తీసేందుకు యువకులు మరోసారి ట్రై చేయడంతో కోపంతో యువకులను వురికించాయి ఏనుగుల గుంపు. ఆ విధంగా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఈ వీడియోను తమిళనాడుకు చెందిన ఐఎఎస్ అధికారి సుప్రియా సాహూ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. మన్యప్రాణులతో సెల్ఫీ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా ఉంటుంది.

ఈ యువకులు అదృష్టవంతులు ఆ ఏనుగుల మంద వాళ్ళని క్షమించి వదిలేశాయి లేదంటే ఏనుగుల గుంపు వాళ్లకి సరైన గుణపాఠం చెప్పడానికి ఎంతో సమయం పట్టేది కాదు. అంటూ ఈ వీడియోకు ట్వీట్ ను జత చేయడం జరిగింది సప్రియా సాహు. ఈ వీడియోను చూసినా అందరు కూడా తమదైన స్టైల్ లో కామెంట్లను పెడుతున్నారు.చాలా ఎక్కువ మంది యువకుల చర్యను తప్పుపడుతుంటే,కొంతమంది మాత్రం జంతువుల సంరక్షణ చర్యల్లో భాగంగా అనిమల్ కారిడార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారు.

ఏనుగులతో సెల్ఫీ దిగుతున్న యువకులు

మరికొందరైతే జరగరానిది జరిగితే అడవి ఇల్లు అనుకొని బతుకుతున్న అడవి జంతువులు నిందిస్తామంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఫోటోల కోసం చేయడానికి చాలామంది తప్పుగా భావిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker