ఎమర్జెన్సీగా మనుషులు ప్రయాణించడానికి తయారుచేసిన డ్రోన్.
పూణేకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ తయారు చేసింది.
ఈ డ్రోన్ భూమి నుండి సుమారు 50 అడుగుల ఎత్తు లో ప్రయాణిస్తుంది.
ఇది దేశంలోనే ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎలక్ట్రిక్ క్రాఫ్ట్ అని దీనిని నడిపించడానికి ఎవరి సహాయం అవసరం లేదు.
ప్రస్తుతానికి ఈ డ్రోన్ ని మెడికల్ ఎమర్జెన్సీ కోసం తయారు చేశారు.
ఈ డ్రోన్ గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ డ్రోన్ సుమారు 500 మీటర్ల ఎత్తువరకు ఎగరగలదు.
ఈ డ్రోన్ కి 16 ఇంజిన్లు కావున ఈ డ్రోన్ ప్రయాణం చేస్తున్న సమయంలో పక్షి ఒక మోటర్ కి తగిలి డ్రోన్ రెక్క సగం విరిగిన ఇది ఎగరటానికి వీలుగా వుంటుంది.
బ్యాటరీ విషయానికొస్తే 50% అయిపోయిన వెంటనే ఎమర్జెన్సీ లోకి వస్తుంది. చార్జింగ్ పూర్తిగా అయిపోయిన సరే ఇందులో ఉన్న పారాషూట్ జాగ్రత్తగా కిందికి దించుతుంది.