ఒకవైపు మూవీస్, మరోవైపు బిజినెస్ రెండిట్లో దూసుకుపోతున్న స్టార్ హీరోస్

By Sunil

Dec 09,2022

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

స్టార్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తున్నారు.

అమీర్పేట్ లో"ఏ ఏ ఏ సినిమాస్"పేరుతో సరికొత్త మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయి బన్నీ చేత్తో ఓపెనింగ్ కి సిద్ధంగా ఉంది.

మల్టీప్లెక్స్ అనేకమంది నిర్మాతల సంయుక్త వెంచర్ అని తెలిసింది.

అల్లు అరవింద్, నారాయణ్ దాస్ నారంగ్, మురళీమోహన్, ఎన్. సదానంద గౌడ్ లాంటి ప్రముఖుల సంయుక్త వెంచర్ ఇది.

త్వరలోనే అల్లు అర్జున్ ఈ మల్టీప్లెక్స్ ని ప్రారంభించనున్నారు.

అలా వైకుంఠపురం, పుష్ప వంటి మూవీస్ ద్వారా సూపర్ హిట్ అందుకుని, నెక్స్ట్ రాబోయే పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ గ్రూప్స్ తో,భాగస్వామ్యం అయి ఏఎంబి మాల్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.

విజయ్ దేవరకొండ కూడా ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మల్టీప్లెక్స్ సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు.