అట్లతద్ది విశిష్టత తెలుసా?

Siva

అశ్వయుజ బహుళ తదియనాడు అట్లతద్ది పండుగను జరుపుకుంటారు. ఉయ్యాల పండుగ అని మరొక పేరు కూడా ఉంది. అంతేకాక గోరింటాకు పండగ అని పిలుస్తారు.

ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, ఇంటిముందు రంగురంగుల ముగ్గులతోఅలంకరిస్తారు.

తమలపాకుపై పసుపుతో తయారుచేసిన గౌరీ మాతను పెట్టి పూజను ప్రారంభిస్తారు. గంధం పసుపు రకరకాల పువ్వులతో పూజ చేస్తారు.

గౌరీమాతను పూజించి ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి.

అట్లతద్ది కథను చెప్పుకొని, తలపై అక్షింతలు చల్లుకోవాలి. ఆ తర్వాత భోజనం చేయాలి. ఈ పండుగలో 11 రకాల పండ్లు తినడం, 11 రకాల తాంబూలాలను వేసుకోవడం, 11 రకాల ఊయలు ఊగడం విశేషం

ముత్తైదువులకు కాళ్లకు పసుపు రాసి, 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా ఇవ్వాలి. అంతేకాక అదే విధంగా అట్లతద్ది కథను చెప్పుకొని, తలపై అక్షింతలు చల్లుకోవాలి.

పిల్లలందరూ  భోజనాలు చేసి, అందరూ కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుకుంటూ ఉయ్యాలలో ఊగుతారు.

చంద్రుని దర్శించిన తర్వాత, తిరిగి స్నానం చేసి, మళ్లీ గౌరీమాతను పూజించి ఆమెకు 11వ అట్లు నైవేద్యంగా పెట్టాలి.

ఈ రోజున చంద్రుడిని ఆరాధించడం వల్ల చంద్రకళల్లో ఉన్న శక్తి వ్రతం ఆచరించిన వారికి కలుగుతుంది. ఆయన ఆశీర్వాదం పొందినందువలన ఆడవారి సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబం సంతోషంగా, ఎటువంటి కష్టాలు లేకుండా, ఆయురారోగ్యాలతో ఉంటారని శాస్త్రం చెబుతుంది.

ఈ వ్రతం చేయడం వల్ల పెళ్లికాని స్త్రీలకు మంచి భర్త లభిస్తాడని ప్రగాఢ నమ్మకం. అదేవిధంగా పెళ్లయిన వారికి సుఖ సౌభాగ్యాలు పొందవచ్చు.

యుక్త వయసుకు రాని ఆడపిల్లలు ఆడిన, పాడిన వాళ్లంతా అమ్మవారిని సేవిస్తున్నట్టే అని పురాణాలు చెబుతున్నాయి.

పదేళ్లు ఈ వ్రతాన్ని జరుపుకొని ఆ తర్వాత చేయడం మానివేసినా కూడా స్త్రీలకు సంసారంలో అన్ని సుఖ ,సంతోషాలు ఉంటాయి.