సుమారు 30 సెంటీమీటర్ల పొడవు గల బాంబు స్టిక్స్ ను ఎంచుకోవలెను.

నాణ్యమైన ఫ్రెష్ చికెన్ ముక్కలను తీసుకొని తగినంత సైజులలో కట్ చేసుకోవలెను.

ఎంచుకున్న చికెన్ ముక్కలకు అల్లం పేస్టు బాగా దట్టించవలెను.

ఎంచుకున్న చికెన్ ముక్కలకు గ్రీన్ చిల్లీ పేస్టు ను కలుపుకోవలెను.

ఎంచుకున్న చికెన్ ముక్కలకు గ్రీన్ చిల్లి, అల్లం పేస్టు మరియు పుదీనా పేస్టు తగినంత ఉప్పును కలుపుకోవలెను.

చికెన్ తో నింపిన బ్యాంబును కాల్చడానికి కట్టెల పోయ్యి ఉపయోగించవలెను.

అల్లం పేస్టు, గ్రీన్ చిల్లీ పేస్ట్ పుదీనా పేస్టు కలిపిన చికెన్ ముక్కలను ఎంచుకున్న బ్యాంబు ముక్క లో వేసి ప్రవేశద్వారం వద్ద ఆకుతో లాక్ చేయవలెను.

చికెన్ ముక్కలతో నింపిన బాంబు స్టిక్స్ ను కట్టెలపొయ్యి లో సుమారు 20 నుంచి 30 నిమిషాల వరకు కాల్చవలెను.

30 నిమిషాల తర్వాత రుచికరమైన బ్యాంబూ చికెన్ తయారయింది. ఈ చికెన్ ముక్కలలో నిమ్మరసం వేసుకంటే ఇంకా రుచిగా ఉంటుంది.