తులసి గింజలను ఎలా వాడాలో తెలుసా?

తులసి గింజలను సబ్జా గింజలు అంటారు, వీటిని బాసిల్ సీడ్స్ అని కూడా పిలుస్తారు.

తులసి ఆకులలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో అవన్నీ వీటిలో కూడా ఉంటాయి.

బాసిల్ సీడ్స్ ని 30 నిమిషాలు నీటిలో వేసి నానబెట్టిన తర్వాతనే వాడాలి.

బాసిల్ సీడ్స్ ని ఎక్కువగా పానీయాల రూపంలో తీసుకుంటారు

పచ్చి కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు కూడా వీటిని అందులో కలుపుకొని త్రాగవచ్చు

మనం రిలాక్స్ కోసం తీసుకునే కూల్ డ్రింక్స్ లలో, అలాగే పండ్ల రసాల లో కూడావీటిని కలిపి త్రాగవచ్చు.

అల్లం రసం, తేనె ,నిమ్మరసం కలిపి అందులో బాసిల్ సీడ్స్ వేసుకొని కూడా తాగవచ్చు.

మనం తినే ఐస్ క్రీమ్ లలో కూడా వేసుకొని తినవచ్చు.

మలబద్ధకం ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడతాయి.

అసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

బాసిల్ సీడ్స్ మన శరీరంలో ఉన్న వేడిని తగ్గించి, చలువనిస్తాయి

బాసిల్ సీడ్స్  చర్మసౌందర్యానికి, అలాగే జుట్టు పెరుగుదలకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది.