చిన్మయికి సరోగసి ద్వారానే పిల్లలు పుట్టారా!

Siva

ఎనిమిదేళ్ల క్రితం యాక్టర్, మరియు దర్శకుడు అయిన రాహుల్ ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది.

2022 జూన్ లో చిన్మయి కవల పిల్లలకు జన్మనిచ్చింది.

ఒకరికి ద్రిప్త  మరియు ఇంకొకరికి శర్వాస్ అనే పేర్లు పెట్టారు.

మీటు ఉద్యమంపై గట్టి పోరాటాన్ని సాగించింది, ఆడవారికి ఎలాంటి విషయాలలోనైనా తోడుగా నిలుస్తుంది.

చిన్మయి సింగర్ కాక డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఎక్కువగా సమంతకు డబ్బింగ్ చెప్పింది.

సింగర్ గా కూడా అనేక పాటలు పాడి, ఎన్నో అవార్డులను పొందింది.

తన ప్రెగ్నెన్సీ విషయంలో అనేక విమర్శలు వచ్చాయి.

తాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దిగిన మొదటి ఫోటో అని ట్యాగ్ పెట్టి, ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది.

గర్భవతిగా ఉన్నప్పుడు తాను ఎలాంటి ఫోటోషూట్ చేయలేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

చిన్మయి, సమంతకు మంచి ఫ్రెండ్, నాగ్ తో విడాకుల తర్వాత వీరి ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయని, సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

సమంత నటించిన శకుంతలం సినిమాకు చిన్మయి డబ్బింగ్ చెబితే బాగుంటుందని చెప్పిన సినిమా యూనిట్.

ఆ మాటలను సమంత కొట్టి పడేసి, చిన్మయి అయితే అసలు వద్దు, నేనే డబ్బింగ్ చెబుతాను అన్నదని  వార్తలు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.

ప్రెగ్నెంట్ ఫోటో అలాగే పిల్లలకు పాలిస్తున్న ఫోటో ద్వారా పిల్లలు తనకే పుట్టారని, సరోగసి ద్వారా పుట్టారు అన్న వారి నోరు మూయించడానికి ఈ విధంగా పోస్ట్ చేసిందని చెప్పవచ్చు.

పిల్లలకు పాలు ఇవ్వడం అనేది ప్రపంచంలోనే ఉత్తమమైన ఫీలింగ్ అని తన మనసులోని భావాలను బయట పెట్టింది.

పిల్లలు ఎలా పుట్టినా అమ్మ అమ్మే అవుతుందని, సరోగసి ద్వారా తనకు పిల్లలు పుట్టారని ఎవరు ఎలా అనుకున్నా నేను పట్టించుకోనని తేల్చి చెప్పింది.