మినప పప్పు ఒక కప్పు, బియ్యం మూడు కప్పులు కలిపి బాగా కడగాలి.
కడిగి పెట్టిన బియ్యం, మినప పప్పులో ఒక టీ స్పూన్ మెంతులు కలపండి.
మినప పప్పు, బియ్యాన్ని కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టాలి.
బాగా నానిన మినప్పప్పు, బియ్యాన్ని ఇప్పుడు గ్రైండర్లో రుబ్బుకోవాలి.
మినప్పప్పు, బియ్యాన్ని రుబ్బుకునేటప్పుడు నీళ్లు ఒకేసారి పోయకూడదు.
కొద్దికొద్దిగా నీరు వేస్తూ రుబ్బుకోవాలి.
దోశ పిండిని మరి మెత్తగా రుబ్బుకోకూడదు.
పిండిని రుబ్బుకున్న తర్వాత రాత్రి అంత వదిలేయాలి.
ఉదయాన్నే బాగా పొంగిన దోస పిండితో దోశలు వేస్తే అవి మృదువుగా రుచిగా వస్తాయి.