దొండకాయలు 65 తయారీ కొరకు అర్థ కేజీ తాజా,లేత దొండకాయలను ఎన్నుకోవలెను.

ఎంచుకున్న తాజా, లేత దొండకాయలను నిలువుగా కోసుకోవలెను.

నిలువుగా, సన్నగా కోసుకున్న దొండకాయలను బాగా కాలుతున్న వంటి వేడి నీటిలో రెండు నిమిషాల పాటు ఉంచి తీయవలెను. ఇలా తీసిన దొండకాయలను సన్నని రంధ్రాలు గల గిన్నెలో తీసుకొని వేరు చేయవలెను.

తర్వాత ఏడు పచ్చిమిర్చి,ఒక పెద్ద ముక్క అల్లం,కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టును ఆరిన దొండకాయల ముక్కలకు పట్టించాలి.అలాపట్టించిన తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి,పావు కప్పు శెనగపిండి,మూడు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్,ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,కొద్దిగా పసుపు,దానికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసి దొండకాయలకు బాగా పట్టించాలి.

బాగా పట్టించిన తర్వాత దొండకాయలను బాగా కాగుతున్న నూనెలో వేసి పది నిమిషాలు మీడియం సెగపై కరకరలాడేలా వేయించుకోవాలి.

వేయించిన దొండకాయలను తర్వాత పక్కన పెట్టాలి.

కరకరలాడే దొండకాయలపై కారం,తగినంత గరం మసాలా, తగినంత ఉప్పు, చల్లుకోవలెను.

బాగా వేయించిన దొండకాయలపై ఉప్పు,కారం గరం మసాలా చల్లడం వల్ల చాలా టేస్టీగా ఉండును.