అవిస గింజలను వాడటం వలన మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు. అవిసె గింజలను నేరుగా కానీ వేరే ఆహార పదార్థాలలో చేర్చి గాని తీసుకొనుట వలన శారీరక పెరుగుదల త్వరగా పెరుగుటకు దోహదపడుతుంది.

ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్ ఇవి గుండె యొక్క పని తనం ను, గుండె ఆరోగ్యానికి మంచి ప్రయోజనకారి.

అవిసె గింజల్లో లిగ్నాన్ అనే పోషక పదార్థం ఉన్న కారణంగా క్యాన్సర్ వ్యాధి నిరోధకానికి చాలా మంచిగా పని చేస్తుంది.

అవిస గింజలలో ఫైబర్ అధిక శాతంలో ఉండుట వలన జీర్ణ క్రియ సాఫీగా జరిగి పెద్ద ప్రేగులలో, మరియు చిన్న ప్రేగులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా సహాయపడతాయి.t

డయాబెటిస్ వ్యాధి గల వారికి బహు చక్కని ఆహారం.

అవిస గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ల వలన వ్యాధి నిరోధక శక్తి సమకూరును.

మహిళలు రుతుక్రమానికి ముందు వచ్చే నొప్పులను తగ్గించే గుణం అవిసె గింజలలో ఉంది,అలాగే మహిళలో వచ్చు రొమ్ము క్యాన్సర్ ను నిరోధించే పోషక పదార్థాలు అవిసె గింజలలో పుష్కలంగా ఉన్నవి.

అవిసె గింజలను తినుట లేదా అవిసె గింజలతో తయారైన నూనెను తల వెంట్రుకలకు పట్టిస్తే వెంట్రుకలు దృఢంగా,ఏపుగా పెరుగుతాయి.

అవిస మొక్క కూడా ఉపయోగపడును ఈ అవిస మొక్కల గడ్డిని నారగా చేసి దుస్తులు తయారీలో వాడుదురు,ఈ నారతో తయారుచేసిన దుస్తులకు మంచి డిమాండ్ కూడా ఉంది.