D విటమిన్ కోసం తీసుకోవలసిన ఆహారాలు తెలుసా?

Siva

సూర్యుని వేడి మన శరీరంపై పడినప్పుడు మన శరీరంలో కొన్ని జీవ క్రియలు జరిగి విటమిన్ D ఉత్పత్తి అవుతుంది.

మన శరీరంలో ఉండే కాల్షియం, ఫాస్పరస్లులను సంగ్రహించడానికి D విటమిన్ చాలా అవసరం. అంతేకాక కండరాల పనితీరు మెరుగుపరచడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా అవసరం.

ఎదిగే పిల్లలకు, 60 ఏళ్లు పైబడిన వారికి 20 మైక్రోగ్రాముల D విటమిన్ అవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఒక రోజుకు అవసరమయ్యే D విటమిన్ 20% ఒక గుడ్డులో ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గుడ్డులోని పచ్చ సనలో విటమిన్ D తో పాటు పోషకాలు, ప్రోటీన్లు, అత్యధికంగా ఉంటాయి

మార్కెట్లలో డి విటమిన్ కలిపిన తృణధాన్యాలు, జూసులు, పాలు, పాల పదార్థాలు అమ్ముతున్నారు. వాటిని ఉపయోగించడం ద్వారా డి విటమిన్ పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

మన శరీరానికి కావలసిన మోతాదులోD విటమిన్ అందదు. అటువంటి సమయాలలో మనకు D విటమిన్ అవసరం అని అనుకున్నప్పుడు D విటమిన్ టాబ్లెట్స్ వాడి ఆ లోపాన్ని తగ్గించుకోవచ్చు.

150 గ్రాముల చేపలలో 13.1 నుంచి 13.6 మైక్రోగ్రాముల D విటమిన్ ఉంటుందని, అదేవిధంగా రెండు టీ స్పూన్ల కాడ్ లివర్ నూనెలో ఐదు మైక్రో గ్రాముల D విటమిన్ అందవచ్చు అని చెబుతున్నారు.

100 గ్రాముల గొర్రెల కాలేయంలో 0.9 మైక్రోగ్రాంలో D విటమిన్ ఉంటుందని తెలియజేస్తున్నారు.

100 గ్రాముల పుట్టగొడుగులలో 10 మైక్రోగ్రాముల విటమిన్ D ఉంటుందని వైద్యులుచెబుతున్నారు.