మేషం వృత్తి వ్యాపారాలలో పార్ట్నర్లతో ఉండే గొడవలు సద్దుమణువుతాయి. చేయాలనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. దేవుని సేవ కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు, ఊహించని ధన లాభం కలగవచ్చు. ముఖ్యమైన విషయాలలో ధైర్యంగా ముందుకు వెళ్లి విజయం పొందుతారు.
వృషభం: కొత్త వస్తువులు, వాహనాలు కోనే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యమైన వారి నుంచి మంచి విషయాలను తెలుసుకుంటారు. ముఖ్యమైన పనులు విజయవంతం అవుతాయి, స్నేహితులతో మంచిగా మెలుగుతారు. ఉద్యోగాలలో వచ్చే అవరోధాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
మిధునం: ఆప్తులతో అనుకోని చిన్నపాటి గొడవలు వస్తాయి, కొత్త అప్పులు చేసే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సజావుగా సాగవు, వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉండవు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.
కర్కాటకం: వ్యాపారాలలో అడ్డంకులు ఎదురవుతాయి, అనుకున్న పనులు త్వరగా పూర్తి కావు, ఇంటా, బయటి విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు, ఉద్యోగాలలో పై అధికారుల నుండి శ్రమ పెరుగుతుంది, కుటుంబం వారితో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సింహం: సమాజంలో మీ విలువ పెరుగుతుంది, అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు, ఆప్తులతో సంతోషంగా ఉంటారు, వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయి, ఉద్యోగాలలో చేసిన పని వల్ల అభినందనలను అందుకుంటారు.
కన్య: మానసిక వేదన పెరగవచ్చు, ఆప్తులతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చేసిన పనులలో విజయం పొందలేక పోతారు, వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. ఉద్యోగాలలో పై అధికారుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మేలు, అనారోగ్యం బాదించే అవకాశాలు ఉన్నాయి, చాలాకాలం నుండి ఉన్న అప్పుల బాధలు ఎక్కువవుతాయి
తుల: వ్యాపారాలలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు, సొంత ఆస్తులను తిరిగి పొందే అవకాశం ఉంది, సమాజంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, చేయాలనుకున్న పనులు త్వరగా పూర్తిచేస్తారు, ముఖ్యమైన వారితో నూతనంగా పరిచయం ఏర్పడవచ్చు.
వృశ్చికం: అనుకోని అడ్డంకులు వచ్చి మీ ప్రయాణాలు ఆగిపోయే అవకాశం ఉంది, ఆప్తులతో చిన్నపాటి గొడవలు సంభవిస్తాయి. ఇంట్ట, బయట పరిస్థితులు అనుకూలించవు, వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.
ధనస్సు: సమాజంలో మీ ప్రాముఖ్యతను పెంచుకుంటారు, ఉద్యోగ ప్రయత్నాలు పలిస్తాయి, అనుకున్న పనులను త్వరగా పూర్తి చేశారు. దేవాలయాలను సందర్శిస్తారు, ఉద్యోగాలలో పై అధికారులతో సన్నిహితంగా ఉంటారు, సొంత ఆస్తి విషయాలలో లాభం అర్జించే అవకాశం ఉంది.
మకరం: కుటుంబ విషయమై తీసుకున్నా నిర్ణయాలను అమలు చేస్తారు. మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా ఉంటాయి, కొత్త బట్టలు నగలను కొనే అవకాశాలు ఉన్నాయి, ఆప్తుల నుండి మంచి విషయాలను అందుకుంటారు.
కుంభం: కుటుంబీకులతో కలిసి దేవాలయాలను దర్శించుకుంటారు. ప్రయాణాలలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, శ్రమ పెరిగి చేయవలసిన పనులను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలు పెట్టుబడుల విషయాలలో జాగ్రత్తలు పాటించడం మేలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు.
మీనం: మనసులో ఆవేదనలు ఎక్కువవుతాయి, కుటుంబంలోని వారి వల్ల కోపాలు పెరిగే అవకాశం ఉంది, చేపట్టిన పనులు ఆటంకాలు వచ్చి ఆగిపోతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడం మేలు. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించవలెను, ఉద్యోగంలో ఆటంకాలు ఎక్కువ అవుతాయి, నూతన డబ్బు ప్రయత్నాలు ఫలించవు.