పోషకాహార లోపంతో బాధ పడే వారు మాత్రం ఉలవలు క్రమం తప్పక తీసుకోవాలి.
వీటిలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్లతో పాటు బోలెడంత పీచూ లభిస్తుంది
రక్తహీనతతో బాధపడేవారూ, కీళ్ల నొప్పులూ, ఇతరత్రా ఎముక సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారూ, పిల్లలూ , మహిళలూ,వీటిని కనీసం రెండు చెంచాలైనా తీసుకుంటే రోజువారీ అవసరాలకు సరిపడా క్యాల్షియం శరీరానికి అందుతుంది.