పునుగులను ఈజీగా తయారు చేసుకుని పద్ధతి.

By Siva

మైదాపిండి అరకప్పు.

ఇడ్లీ పిండి ఒక కప్పు.

ఉప్పు రుచికి సరిపడినంత అలాగే చిటికెడు వంట సోడా.

నూనె డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత.

ఒక వెడల్పైన గిన్నెను తీసుకోవాలి. అందులో ఇడ్లీ పిండిని, ఉప్పు, మైదా పిండిని వేసి, కొంచెం కొంచెం నీళ్లు పోసి, ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి.

కొంచెం కొంచెం నీళ్లు పోసి, ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండిని ఎక్కువ గట్టిగానీ, పలుచగా కానీ లేకుండా ఉండేలా చూసుకోవాలి.

స్టవ్ పై కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనె వేసి, బాగా వేడి అవ్వనివ్వాలి. నూనె బాగా వేడయ్యాక పిండిని చిన్న చిన్న ఉంటల్లా తీసుకొని నూనెలో వేయాలి.

పునుగులు చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే మంటను ఉంచుకోవాలి.

నూనెలో వేసిన పిండిని బాగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఉల్లిపాయతో పాటు, పల్లీల చట్నీతో తింటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.