కార్తీక పౌర్ణమి జరుపుకో వలసిన  రోజు ఇదే!

By Siva

మంగళవారం చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు కార్తీక పౌర్ణమి జరుపుకోవడానికి వీలు కాదు.

కార్తీక పౌర్ణమి చేసుకోవడానికి పౌర్ణమి ఘడియలు, అలాగే సంపూర్ణ చంద్రుడు చాలా అవసరం.

కార్తీక పౌర్ణమిని 7 తేదీ కానీ, 14వ తేదీ సోమవారం కానీ జరుపుకోవచ్చు.

కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం రావడం చాలా మంచిది.

14వ తేదీ కార్తీక సోమవారం, ఆరోజున సంపూర్ణ చంద్రుడు ఉండడం వలన, ఆ రోజున కూడా కార్తీక పౌర్ణమి జరుపుకోవచ్చు.

కార్తీక పౌర్ణమి రోజున మహావిష్ణువును అలంకార ప్రియుడిగా భావించి పూజలు చేస్తారు.

శివుడిని త్రిపురారిగా భావించి, అభిషేకాలు చేసి పూజలు చేస్తారు

కార్తీక పౌర్ణమి రోజు కార్తీక  స్నానం ఆచరించి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షను చేస్తారు.

చంద్రోదయం కాగానే 365 దీపాలను వెలిగించి దీపారాధన చేస్తారు.

ఈ విధంగా దీపారాధన చేయడం ద్వారా 1000 యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని శాస్త్ర నిపుణులు అంటున్నారు.