ఖుషి టు సినిమాలో నటించబోతున్న కృతి శెట్టి.
By Siva
ఉప్పెన సినిమాలో తన స్టైల్ లో నటించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.
కృతి నటించబోయే సినిమాలలో ఖుషి టు సినిమా ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ సమంత కలిసి నటిస్తున్న సినిమా ఖుషి 2.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేసి రెండు షెడ్యూల్స్ కూడా పూర్తిచేసుకుంది.
ఈ సినిమాలో కృతి శెట్టి కూడా నటిస్తుందనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమాలో కృతి శెట్టి నటించే రోల్ నెగిటివ్ క్యారెక్టర్. సినిమా లాస్ట్ మూమెంట్స్ లో తను మారి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అనే వార్త వినిపిస్తుంది.
ఈ వార్తపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు మాత్రమే.
ఈ సినిమా ద్వారా అయినా కృతికి మంచి హిట్ పడుతుంది అని అభిమానులు అంచనా వేస్తున్నారు.