మురుకులను తయారు చేసుకునే విధానంలో తప్పనిసరిగా పాటించాల్సినవి...
ఏ కాలంలో నైనా పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే స్నాక్స్ లో చుట్టలు లేదా మురుకులు ఎంతో ముఖ్యమైనవి.
వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టుకొని, తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి.
తరువాత ఆ బియ్యం లో పోట్నాల పప్పులు, సెనగపప్పు మినప్పప్పు, జీలకర్ర కలిపి మెత్తగా పిండిని తయారు చేసుకోవాలి.
ఈ బియ్యపు పిండిలో సగ్గుబియ్యం కలిపి పట్టించిన పిండితో మురుకులను చేసుకోవచ్చు.
అలా తయారు చేసుకున్న పిండిలో రుచికి సరిపడా కొంచెం కారం ఉప్పు జీలకర్ర ఇంగువ వేసి నీటితో ముద్దగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి రొట్టెలు తయారు చేసుకునే పిండిలాగా ముద్దగా చేసుకోవాలి.
చుట్టాల పావులో వచ్చే అచ్చుల ద్వారా మురుకులను మనకు నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చు.
నూనెలో బాగా రెండు వైపులా బాగా కాల్చడం ద్వారా టేస్టీగా స్పైసీగా ఉండే మురుకులు రెడీ అవుతాయి.