మళ్లీ తెరపైకి వచ్చిన నరేష్, పవిత్ర లోకేష్ మధ్య కెమిస్ట్రీ.
By Siva
నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ షిప్ గురించి, ప్రతిసారి ఏదో ఒక రకమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
నరేష్, పవిత్ర కలిసి ప్రధాన పాత్రలో నటించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమా విడుదలయ్యింది.
మలయాళంలో పెద్ద హిట్ పొందిన వికృతి అనే సినిమాను తెలుగులో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే పేరుతో రీమిక్స్ చేశారు.
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమాలో హీరోగా అలీ మహమ్మద్ సమీర్ అనే పాత్రలో నటించారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా మౌర్యాని రూబ పాత్రలో నటించింది.
నరేష్ శ్రీనివాసరావు పాత్రలో, పవిత్ర లోకేష్ సునీత పాత్రలో నటించారు.
ఈ సినిమాలో నరేష్, పవిత్ర భార్యాభర్తలు గా నటించడమే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
సినిమాలో వీరిద్దరి జోడి బాగుందని, వీరిద్దరికీ మధ్య కెమిస్ట్రీ బాగా ఉందని, చూసి అభిమానులు చెబుతున్నారు.
నిజజీవితంలో నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ఉన్న కెమిస్ట్రీని అచ్చు గుద్దినట్లుగా సినిమాలో పండించారు అని అభిమానులు పేర్కొంటున్నారు.
ఆలీ గారు తీసిన ఫోటో ద్వారానే వీరి జీవితాలు ఎలా మారిపోతాయో అనేదే ఈ సినిమాలో ట్విస్ట్.
సినిమాలో అలీ పాత్ర వల్ల నరేష్, పవిత్రల జీవితంలో ఎలా మార్పు వచ్చిందో చూపించే సన్నివేశాలు బాగున్నాయని అభిమానులు అంటున్నారు.
సినిమా చూసిన వారందరూ హీరో, హీరోయిన్ గురించి పక్కనపెట్టి పవిత్ర, నరేష్ కెమిస్ట్రీ గురించి చెబుతున్నారు.
పవిత్ర, నరేష్ కెమిస్ట్రీ అందర్నీ అంత ఆకర్షించిందని తెలుస్తుంది.
ఈ విధంగా ఈ సినిమా ద్వారా పవిత్ర, నరేష్ మళ్లీ సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు.