భారతీయులు వేప చెట్టును శక్తి స్వరూపినిలా, అమ్మవారిలా  ఆరాధించి పూజలు చేస్తారు.

లేత వేప ఆకులను ఉండలుగా చేసుకొని పరగడుపుననే తినటంవలనఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చును.

ఎలాంటి మొండి దగ్గు అయినా, కడుపులో వికారం అయినా,వేప బెరుడు ను కషాయంగా చేసుకొని సేవించడం ద్వారా నయం చేసుకోవచ్చును.

వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని ప్రతి రోజు సేవించడం ద్వారా కాలేయంనకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చును.

వేప ఆకును సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు, మరియు ముఖంపై వచ్చు మొటిమల నివారణ కొరకు వేపఆకు తో తయారుచేసిన సౌందర్య లేపనాలనును ఉపయోగిస్తారు.

కేశ సౌందర్యంకొరకు,చుండ్రు నివారణ కొరకు వేపఆకును ఉపయోగిస్తారు.

దంత సంరక్షణకు నోటిలో దుర్వాసన నివారణకు వేప పుల్లతో దంతాలు తోముట ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చును.

వేప ఆకు ను పొగ వేయడం ద్వారా క్రిమి కీటకాలను, దోమలను ప్రారదోలవచ్చును.

వేప గింజల ద్వారా నూనెను తీస్తారు మిగిలిన పిప్పిని జీవ రసాయన ఎరువు గా ఉపయోగిస్తారు.