ఉల్లిపాయ వల్ల మన కురులకు ఎన్ని లాభాలో తెలుసా?

2002 లో యూనివర్సిటీ ఆఫ్ బాగ్దాద్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అనే సంస్థ ఇరాక్ లో ఉల్లిపాయ మీద పరిశోధనలు చేసి ఉల్లిపాయ వల్ల జుట్టుకు రక్షణ కలుగుతుందని తెలిపారు.

ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జుట్టుకుదురులకు అవసరమైన కెరాటిన్  ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడుతుంది.

ఉల్లి లో ఉండే సల్ఫర్ తలలో మాడు కింద ఉండే కోలాజిన్ ను ఆరోగ్యంగా తయారు చేస్తుంది. అందువల్ల జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.

 ఉల్లి  ఉండే క్యాపిరాలు వర్సిటీన్లు వల్ల జుట్టుకుదురులకు అందించే రక్తనాళాలను వ్యాకోపింపజేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.

ఉల్లిలో సల్ఫర్, అమోనియం ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకు వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడతాయి.

తలలో ఉండే చుండ్రును తగ్గించుకోవడానికి ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుంది.

ఉల్లి పేస్టును తలకు బాగా మర్దన చేస్తూ పట్టించి ఆరిన తర్వాత తల స్నానం చేస్తే మంచి లాభాలను పొందవచ్చు.