ఆలీతో సరదాగా షోకు రాబోతున్న పవన్.

By Siva

పవన్ కళ్యాణ్ కు అత్యంత దగ్గరగా ఉండే సన్నిహితుల్లో ఆలీ గారు ఒకరు.

2019లో ఆలీ వైసీపీలో చేరినందువలన వీరిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి

జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ అన్న మాటలకు అలీ దీటుగా సమాధానం ఇచ్చాడు.

అలీ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పదవిని ఇచ్చింది. ఏపీ గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా పదవిని ఇచ్చింది.

ఆ సందర్భంలో ఆలీ 2024 ఎన్నికల్లో ఛాన్స్ ఇస్తే పోటీ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు

పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమాలలో నటించాలని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

ఆలీతో సరదాగా షోకు పవన్ కళ్యాణ్ కచ్చితంగా వస్తాను అని చెప్పినట్లుగా  అలీ తెలిపాడు.

భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలలో సీరియస్ మూవీ కనుక తను నటించలేదని వివరణ ఇచ్చాడు.

జోక్స్ ఉండే సినిమా అయితే కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తానని చెప్పాడు.

కొంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు.

దీంతో వీళ్ళిద్దరూ కలవబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.