నాణ్యమైన,స్వచ్ఛమైన బియ్యంతో అన్నం వండుకోవలెను

నాలుగు రెమ్మల కరివేపా కొమ్మలను తీసుకొని నీటితో కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి.

Fill in some text

నాలుగు తాజా పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి.

సిద్ధంగా ఉంచుకున్న కరివేపా రెమ్మలు, పచ్చిమిరప కాయలను మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవలెను.

పచ్చిమిరపకాయలు,కరివేపా రెమ్మలను పేస్టులా చేసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పును, కొంచెం ఇంగువను కలుపుకోవలెను.

కరివేపా,మిర్చి పేస్టును ఒక బౌల్ లో తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని సన్నని మంటపై ఉడికించవలెను.

సిద్ధంగా ఉంచుకున్న అన్నం ను వేయించిన కరివేపా, పచ్చిమిరపకాయల పేస్టులో వేసి బాగా కలుపుకోవలెను.

కరివేపా,పచ్చిమిరపకాయ పేస్టుతో కలిసిన అన్నంలో తాజా నిమ్మకాయ రసం ను కలపవలెను.అందువల్ల మరింత రుచికరంగా ఉండును.

రుచికరమైన కరివేపా రైస్ తయారు.