By Siva
మయోసైటీస్ వ్యాధి బారిన పడ్డ సమంత.
అందరి ప్రేమ, అభిమానాలు నీకు మరింత బలాన్ని ఇస్తాయి, డియర్ సామ్. అంటూ అఖిల్ పోస్ట్ చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి: డియర్ సామ్ జీవితంలో అనేక మార్పులు వస్తుంటాయి, సవాళ్లు వస్తుంటాయి, వాటి వల్లనే మనం ఎంత శక్తివంతులమో తెలుస్తుంది. నువ్వు ఎంతో మనోబలంతో కూడిన అమ్మాయివి. ఈ ఛాలెంజ్ల అన్నిటిని త్వరలోనే అధిగమిస్తావు. నువ్వు జీవితంలో ఎన్నో ఓడుదుడుకులను అధిగమించావు. వాటితో పోలిస్తే ఇది చాలా చిన్నది. నాకు నమ్మకం ఉంది. నువ్వు త్వరగా కోలుకుంటామని చిరంజీవి తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్లో నువ్వు త్వరగా కోలుకోవాలి, మీకు ఆ ధైర్యాన్ని నేను పంపుతున్నాను అంటూ పోస్ట్ చేశాడు.
నాగబాబు: ధైర్యమైన వారిలో సమంత ఒకరని. ఆమెకి వ్యాధి వచ్చినందుకు తన హృదయం ఎంతో చింతించిందని, సామ్ త్వరగా కోలుకోవాలని, ముందుకంటే ఇప్పుడు బాగా ధైర్యంగా తిరిగి రావాలని చెప్పారు. సమంతా స్వతంత్ర మహిళగా, శక్తి సామర్ధ్యాలు కలిగిన ఆశావాది వ్యక్తిగా చూశానని, ఇప్పుడు తనను ఇలా చూడటం చాలా బాధగా ఉందని, తను త్వరగా కోలుకొని రావాలని ఆశిస్తున్నాను.
సినీ పరిశ్రమలోని ప్రముఖులు సమంత ఆరోగ్య విషయంపై స్పందిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
పెళ్లి చేసుకుని విడిపోయిన, తను ఒకప్పటి మాజీ భార్య, అలాగే తనతో సినిమాల్లో నటించింది, అన్న ధోరణితోనైనా, నాగచైతన్య, సమంత కోలుకోవాలని కోరుకోవచ్చు కదా! అంటూ సమంత అభిమానులు తనపై ట్రోల్స్ చేస్తున్నారు.
నాగార్జున గారు తన మాజీ కోడలు సమంతను స్వయంగా వెళ్లి కలిసి తన ఆరోగ్య విషయంపై పరామర్శించబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఏదేమైనా సమంత కోరుకోవాలని, తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. కొందరు పూజలు కూడా చేస్తున్నారు.
సమంత ఆరోగ్య విషయంపై వచ్చిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏదేమైనా వారి కోరిక ఫలించి దేవుని ఆశీర్వాదం వలన సమంత కోరుకోవాలని ఆశిద్దాం.