Samsung Galaxy Z Fold 3: 30 వేల తగ్గింపు

Samsung Galaxy Z Fold 3: 30 వేల తగ్గింపు

ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లో 12GB RAM+ 256GB ROM తో ఉండే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్3 సాధారణంగా దీని ధర ₹1,49,999 ఉంటుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపీనెస్ డేస్ సేల్స్ సందర్భంగా సుమారు 30 వేలు తగ్గింపుతో ₹1,19,999 కి ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

యాక్సిస్, సిటీ బ్యాంక్, అండ్ ఐసిఐసిఐ బ్యాంకు కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరొక ₹1,500 వరకు ఆదా చేసుకోవచ్చు.

శామ్సంగ్ గాలక్సీ జెడ్ ఫోల్డ్ 3, 7.6 అంగుళాల QXGA+ డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ప్రైమరీ డిస్ప్లే ఇందులో ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్లో ఉండే రెండు డిస్ప్లే లు 120 Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటాయి. స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

2 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగా పిక్సెల్ టెలిఫోన్ కెమెరా లు ఉన్నాయి.

వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 10 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లో 4,400mAh బ్యాటరీ ఉండగా, 25W వైర్డ్ లేదా వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

4G, 5G LTE, WiFi 6, GPS, NFC, అల్ట్రా వైడ్ బ్యాండ్, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.2, USB TYPE-C పోర్ట్ కనెక్టిిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

more details