స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది.

ఎందుకనగా అకౌంట్ పాస్వర్డ్ విషయంలో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

అకౌంట్ పాస్వర్డ్ పెట్టుకోవడంలో చాలా జాగ్రత్తగా వుండాలి.

రోజురోజుకి పెరుగుతున్న సైబర్ నేరాల దృష్టిలో ఉంచుకొని SBI ట్విట్టర్ ద్వారా ఇలాంటి పాస్వర్డ్ పెట్టుకోవాలో సూచిస్తుంది.

ABCD,abcd,1234 వంటి పాస్వర్డ్లను ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు అని తెలియజేశారు.

బలహీనమైన పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల హ్యాకర్లు చాలా తొందరగా గుర్తిస్తున్నారు.

పాస్వర్డ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే @_+=లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండవలెను.

నెంబర్ తో పాటు క్యారెక్టర్స్ ఉంటే మీ అకౌంటు చాలా భద్రంగా ఉన్నట్లు ఉంటుంది.