శ్రీశైలంలో మొదలైన కార్తీక ఉత్సవాలు.
Siva
ఈ సంవత్సరం అక్టోబర్ 26వ తేదీ నుండి కార్తీకాలు ప్రారంభమై నవంబర్ 23 వరకు ఉంటాయి.
ఈ కార్తికాలలో ముందుగా గుర్తొచ్చేది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం.
శ్రీశైలంలో కార్తీకమాస ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపిస్తారు.
స్వామివారి సన్నిధిలోని నాగుల కట్టా ప్రాంగణం వద్ద దీపారాధనను రద్దు చేశారు.
ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద ఉన్న ఉత్తర మాడవీధులలో భక్తులు దీపారాధన చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
కార్తీక మాసంలో భక్తులతో శ్రీశైల ఆలయం కిటకిటలాడుతుంది.
ఆలయం ఈ ఓ లవన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్ని సదుపాయాలను సమకూర్చారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయమే కాక, శ్రీశైలంలో ఉన్న అనే కాలయాలు ఎంతో విశిష్టమైనవి.
శ్రీశైలంలో ఉన్న శివాజీ ఆలయం, మల్లమ్మ కన్నీరు, పాలధార పంచదార, చెంచులక్ష్మి మ్యూజియం, రుద్ర పార్క్, శ్రీశైలం డ్యాంమ్ ఇవేకాక చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి.
శ్రీశైలం వెళ్ళినవారు కచ్చితంగా సాక్షి గణపతిని దర్శించాలని ప్రగాఢ విశ్వాసం.