By Sunil
Nov 15,2022
ఇంగ్లాండ్ ప్రపంచకప్ ను సాధించడం ఇది రెండోసారి.
ఈ టోర్నీ ముగియడంతో అన్ని జట్లు ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్ లపై దృష్టి పెట్టాయి.
ఈ టోర్నీ ముగియడంతో అన్ని జట్లు ప్రస్తుతం ద్వైపాక్షిక సిరీస్ లపై దృష్టి పెట్టాయి.
ఈ క్రమంలో టీమిండియా జట్టు న్యూజిలాండ్లో పర్యటించనుంది.
టీమిండియాలో జరుగుతున్న పరిస్థితులపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా జట్టుకు ప్రధాన కోచ్ ఉండగా, మరొక బ్యాటింగ్ కోచ్ టీం ఇండియాకు అవసరం లేదని చెప్పాడు.
బీసీసీఐ నిర్ణయాలను విమర్శిస్తూనే, జట్టులో ఆటగాళ్ల కన్నా సపోర్టింగ్ స్టాఫ్ ఎక్కువ అవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇలాంటి పరిస్థితులు జట్టులో ఉన్నప్పుడు బ్యాటర్స్ గందరగోళానికి గురి అయ్యే ఛాన్స్ ఉందని ఆయన వ్యక్తం చేశారు.