ఎలాంటి మచ్చలు లేని,చెడిపోని తాజా పచ్చి చింతకాయలను ఎన్నుకోవలెను.

ఒక కిలో పచ్చి చింతకాయలకు,200 గ్రామ్స్ గల్లా ఉప్పు,తగినంత పసుపు ఉండే విధంగా సిద్ధం చేసుకోవలెను.

తయారుగా ఉంచుకున్న పచ్చి చింతకాయలను మిక్సీలో కన్నా సాంప్రదాయ బద్దకమైన రోలులో తగినంత ఉప్పు,పసుపు కలుపుకొని దంచుకోవలెను.

చింతకాయ తొక్కును ప్లాస్టిక్ డబ్బా లో గాని, జాడీలో గాని ఏలాంటి తేమ లేకుండా జాగ్రత్తగా చూసుకొని నిలువ చేసుకోవలెను.

జాడీలో నిలువ చేసుకున్న చింతకాయ తొక్కును వారం రోజుల తర్వాత మరల ఇంకోసారి రోలు లో వేసి దంచుకోవాలి.

చింత తొక్కును చింతకాయ పచ్చడిగా చేయాలంటే చింత తొక్కుతో పాటుగా మెంతులు,వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, అల్లం, తగినంత ఉప్పు అవసరం.

చింత తొక్కును పచ్చడిగా చేసుకోవాలంటే ఒక బౌల్లో తగినంత ఆయిల్ తీసుకొని అందులో  ఉల్లిపాయ ముక్కలను, వెల్లుల్లిని, తగినంత మెంతులు, తగినంత కరివేపాఆకులు, పచ్చిమిరపకాయలు (లేదా) ..

ఎండుమిరపకాయలు రెండు అల్లం ముక్కలు, అవసరం అనుకున్నంత చింత తొక్కును వేసుకొని వేయించుకోవలెను, ఇప్పుడు చింతతొక్కు చింత పచ్చడిగా మారిపోయింది

గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు చింత పచ్చడి  ఎక్కువగా ఉపయోగిస్తారు.

చింతకాయ పచ్చడి పేషెంట్లకు ఎక్కువగా ఉపయోగిస్తారు.