వాహనాలకు విభిన్నమైన రంగులతో కలిగిన నెంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి మరియు వాటి అర్థాలు ఏంటి?
వివిధ రకాల వాహనాలకు అనేక రంగులతో నెంబర్ ప్లేట్లు నీలం,తెలుపు, నలుపు,పసుపు,ఎరుపు,ఆకుపచ్చ వంటి నెంబర్ ప్లేట్లు చూసే ఉంటాం.
నలుపు రంగు నెంబర్ ప్లేట్ సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు ఇవ్వబడే వాహనాలకు ఈ నెంబర్ ప్లాట్ ఉంటుంది. ఇంకా అద్దెకి ఇవ్వబడే వాహనాలకు మాత్రమే నలుపు రంగు నెంబర్ ప్లేట్ ఉంటుంది.
ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ భారత రాష్ట్రపతి, ఆయ రాష్ట్రాల గవర్నర్ల వాహనాలపై మాత్రమే ఎరుపు రంగు నెంబర్ ప్లేట్ వుంటుంది. ఈ నెంబర్ ప్లేట్లో నెంబర్ కు బదులుగా అశోక చిహ్నం ఉంటుంది.
తెలుపు రంగు నెంబర్ ప్లేట్ ఒక సాధారణ వ్యక్తి యొక్క మోటార్ సైకిల్ గాని కార్,ఏదైనా ఒక వాహనానికి తెలుపు రంగు నెంబర్ ప్లేట్ ఉంటుంది. అదేవిధంగా భారత ప్రధాని కార్ల నెంబర్ ప్లేట్ కూడా ఇలానే ఉంటుంది
బ్లూ రంగు నెంబర్ ప్లేట్ విదేశీ ప్రతినిధులు ఉపయియోగించే వాహనాలకు మాత్రమే రకమైన నెంబర్ ప్లేట్ ఉంటుంది.
బాణం గుర్తు ఉన్న నెంబర్ ప్లేట్ సైనిక వాహనాలకు రకరకాల నెంబర్ సిస్టమ్ లను ఉపయోగిస్తారు. రిజిస్ట్రేషన్ నెంబర్ రెండు అంకెల వెనకాల లేకముందు బాణం గుర్తు పైకి చూపి ఉంటుంది.
పసుపు రంగు నెంబర్ ప్లేట్ పబ్లిక్, వాణిజ్య ఉపయోగించే వాహనాలపై మాత్రమే ఉంటుంది.
ఆకుపచ్చ రంగు నెంబర్ ప్లేట్ ఎలక్ట్రిక్ వాహనానికి మాత్రమే ఆకుపచ్చ నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఇలాంటి కాలుష్యం వెలువడనీ వాహనాలకు మాత్రమే ఈ విధమైన నెంబర్ ప్లేట్ ను కేటాయిస్తారు.