టమోటా రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
ముందుగా నాలుగు అయిదు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, టమోటాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ముందుగానే అన్నం వండుకొని సిద్ధం చేసుకోవాలి.
స్టవ్ పై బాండీ పెట్టి పోపు దినుసులు వేసి అవి వేగాక బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.
అందులో తయారు చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి.
అందులోనే కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి వేయించాలి.
అలాగే వండుకొని సిద్ధంగా చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలపాలి.
ఈ విధంగా చేయడం వల్ల టమోటా రైస్ తయారవుతుంది