వరలక్ష్మీ వ్రతానికి కావలసిన వస్తువులు ఇవే.
రాగి కలశం కానీ ఇత్తడి కలశం కానీ తీసుకోవాలి.
కలశంలో ఉంచుకోవడానికి తమలపాకులు.
అమ్మవారిని అలంకరించడానికి పువ్వులు.
కలశాన్ని అలంకరించుకోవడానికి మామిడాకులు.
కంకణం కట్టుకొనుటకు తెల్లటి దారం.
ఉపవాసంతో మాత్రమే ఈ పూజ చేయవలసి ఉంటుంది.
వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తప్పనిసరిగా భార్యాభర్తలు బ్రహ్మచర్యమును పాటించవలసి ఉంటుంది.
కలశంను ఎట్టి పరిస్థితులలో కింద పెట్టకూడదు.బియ్యం పై కానీ పీటపై గాని ఉంచాలి.
కలశంలోకి నిండు కుండలోని నీళ్లను మాత్రమే తీసుకోవాలి.
వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఇంట్లో మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు.
కలశమును సాయంకాలం ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదు .మరుసటి రోజు ఉదయం మాత్రమే కదిలించాలి.