లవంగంతో కర్పూరాన్ని కలిపి వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

By Siva

డబ్బు నష్టాన్ని తగ్గించుకోవడానికి వాస్తు శాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో లవంగాలు ఒకటి.

లవంగం, కర్పూరం కలిపి వాడటం వల్ల వాస్తు దోషం తొలగి డబ్బు నష్టం తగ్గుతుందని ప్రగాఢ నమ్మకం.

ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రతిరోజు కర్పూర హారతి ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు

ఒక గిన్నెలో ఐదు లవంగాలు, కర్పూరం, యాలకులు కలిపి వాటిని కాల్చి ఆ పొగను ఇల్లంతా ధూపం వేయడం చాలా మంచిది. ఇల్లంతా ధూపం వేసిన తర్వాత ఆ ధూపాన్ని దేవుడి దగ్గర ఉంచాలి.

ధూపం వేసిన పొగ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని తీసివేసి, పాజిటివ్ ఎనర్జీతో నింపుతుంది. దీని వలన మనకు, మన కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది.

ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కర్పూరాన్ని ఆవు నెయ్యిలో ముంచి, ఇత్తడి కుండీలో లేక దేవునికి హారతిని ఇచ్చే హారతి పళ్లెంలో వేసి కాల్చాలి

ఈ విధంగా చేయడం ద్వారా శత్రువులను ఓడించవచ్చు. వారి వల్ల వచ్చే అపాయాలను తొలగించుకోవచ్చు.

వాస్తు శాస్త్రంలో తెలిపినట్లుగా చేయడం ద్వారా, ఎటువంటి కష్టాలు లేకుండా కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు.