మంచితనానికి మారుపేరుగా నిలిచిన విజయ్ దేవరకొండ.

By Siva

బాలల దినోత్సవం సందర్భంగా మాదాపూర్ లోని ఫేస్ హాస్పిటల్ లో జరిగిన ఒక కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.

హాస్పిటల్ యజమాన్యం ఆధ్వర్యంలో, చిన్న పిల్లల కాలే మార్పిడి అనే విషయంపై అవగాహన సదస్సును ఏర్పరిచారు

ఆ సదస్సుకు హాజరైన విజయ్, మలావత్ పూర్ణ కాలేయ వ్యాధితో పోరాడుతున్న పిల్లల కోసం, 24 గంటల హెల్ప్ లైన్ సేవలను ప్రారంభించారు.

దీంతో విజయ్ చెప్పిన మాటలు సోషల్ మీడియా మొత్తం హాట్ టాపిక్ గా మారాయి.

బతుకున్నంత వరకు తన శరీరంలో ఉండే అవయవాలు చెడిపోకుండా, ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకొని, ఆ తర్వాత తను చనిపోయినప్పుడు అవయవాలను దానం ఇస్తానని చెప్పాడు.

అవయవాలను దానం చేయడం వలన ఇంకొకరి జీవితం నిలుస్తుందని చెప్పాడు

అందువల్లనే విలువైన అవయవాలను మట్టిపాలు చేయడం కన్నా, వేరే వారికి దానం ఇస్తే వారికి జీవితాన్ని ఇచ్చిన వారం అవుతాంఅని చెప్పాడు.

హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన విషయాలను వీడియో ద్వారా హాస్పిటల్ వర్గాలు ట్విట్టర్లో బుధవారం రోజున పోస్ట్ చేశారు.

ఈ మాటలు విన్న అభిమానులు విజయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ అన్న మంచి మనసున్న హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు అభిమానులు విజయ్ దేవరకొండను నువ్వు దేవుడవు, అవయదానం చేసి మరొకరికి జీవితాన్ని ఇచ్చిన వాడవు అవుతావని విజయం పొగుడుతున్నారు.