పులస చేప ప్రత్యేకత ఏంటో తెలుసా?

చేపల వేలంపాటలో రెండు కేజీల పులస చేప 19 వేలకు అమ్ముడు పోయింది.

పులస చేపలు ఖండాలు దాటి నీటికి ఎదురుగా ఈదుతూ ఉభయగోదావరి జిల్లాలోకి వస్తాయి.

ఈ పులస చేపలను పట్టుకోవడానికి ప్రత్యేకమైన వలలను ఉపయోగిస్తారు.

 ఒక్క చేప దొరికితే చాలు పండగ చేసుకోవచ్చని జాలర్లు చెబుతుంటారు.

ఒడిస్సా ,బంగ్లాదేశ్ తీరాల్లో కూడా పులస చేపలు దొరుకుతాయని ప్రజలు చెబుతున్నారు.

గోదావరి జిల్లాలోకి ఎర్ర నీరు రాగానే వచ్చిన ఇలస చేపలు మూడు రోజులలో పులసగా మారుతాయి.

ఇలస చేపలు నీటికి ఎదురీదడం వల్ల వాటి శరీరానికి ఉండే ఉప్పు లవనాలు కరిగిపోవడం వల్ల ఎక్కడ ఏ చేపలకు లేనంత టేస్ట్ ను ఇస్తాయి.

పులస చేపలు ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలోని అంతర్వేది, భైరవపాలెం నర్సాపురంలో దొరుకుతాయి.

ఆషాడ, శ్రావణమాసాలలో గుడ్లు పెట్టి తిరిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్లి పోతాయి.

పులస చేప శాస్త్రీయ నామం  హిల్సా హిల్సా.

పులస చేపలు సంవత్సరంలో ఆషాడ, శ్రావణ మాసంలో మాత్రమే దొరుకుతాయి.

ఎన్నిసార్లు తిన్న మళ్లీమళ్లీ తినాలి అనిపించేంత టేస్ట్ గా ఉన్నందువల్ల వీటికి అంత డిమాండ్.