వీసా లేకుండా ఇండియన్స్ ని పర్యటనకు అనుమతించే తొమ్మిది దేశాలు ఉన్నాయి అవి

భూటాన్ వెళ్లాలంటే ఇండియన్స్ కి పాస్పోర్ట్ లేదా ఓటర్ కార్డు ఉంటే చాలు. పాస్పోర్ట్ అయితే కనీసం ఆరు నెలలు చెల్లుబాటు అయ్యేది ఉండాలి. ఓటర్ కార్డ్ అయితే ఎన్నికల సంఘం జారీ చేసినది ఉండాలి

భూటాన్

కాంబోడియా కి వెళ్లాలంటే వీసా ఆన్ ఎరైవల్ అనే పద్ధతిలో వీసాను అప్లై చేసుకోవాలి. ఆ దేశానికి చేరుకున్న తర్వాత వీసాను తీసుకోవాలి. అయితే బయలుదేరేముందు వీసా అప్లై చేసుకోవాలి రెండు మూడు రోజుల్లో వీసా సులువుగా వస్తుంది

కంబోడియా

ఈ అందమైన దేశాన్ని మనం చూడాలంటే ఎలాంటి వీసా అవసరం లేదు,మన పర్యటన 30 రోజుల్లో ముగిసిపోవాలి.

ఇండోనేషియా

లావోస్ కి వెళ్ళాలంటే మనం ముందుగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్లిన తర్వాత వీసా ఆన్ ఎరైవల్ పద్ధతిలో 30 రోజుల వీసా మంజూరు చేస్తారు. మనకు కనీసం ఆరు నెలలు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ ఉండాలి.

లావోస్

ఈ అందాలతో కూడుకున్న దీవినీ చూడాలంటే అక్కడికి వెళ్లిన వెంటనే మన ప్రయాణ పత్రాలు చూపి వీసా ఆన్ ఎరైవల్ పద్ధతిలో టూరిస్ట్ వీసాను తీసుకోవాలి. ఈ వీసా 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.

మాల్దీవ్స్

మయన్మార్ కు వెళ్లాలన్న కూడా వీసా ఆన్ ఎరైవల్ పద్ధతిలో 30 రోజుల వీసాను తీసుకోవాలి. దీనిని ఎయిర్ పోర్టులో ఉచితంగా ఇస్తారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో మయన్మార్ కు వీసా పొందడం ఇంకా సులువు.

మయన్మార్

మన పొరుగు దేశమైన ఈ దేశానికి వెళ్లడానికి మనకు ఎలాంటి వీసా అవసరం లేదు. భారత ప్రభుత్వం, ఎన్నికల సంఘం జారీ చేసిన పత్రాలు ఉంటే చాలు.

నేపాల్

ఈ దేశానికి వెళ్ళడానికి వీసా ఆన్ ఎరైవల్ పద్ధతిలో విసా తీసుకోవాలి. ముందుగా శ్రీలంక ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి. దీనిని ఆన్లైన్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా తీసుకోవచ్చు.

శ్రీలంక

వీసా ఆన్ ఎరైవల్ పద్ధతిలో మీ వీసాను సంపాదించి, థాయిలాండ్ ను చూడవచ్చును. కానీ పర్యాటక ప్రాంతాలు మాత్రమే సందర్శించడానికి అనుమతిస్తారు. కనీసం 30 రోజులపాటు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ ఉండాలి.

థాయిలాండ్

More details