వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్- ఇక యుద్ధమే

ఈరోజు నుంచి మనందరి బతుకులు బాగుపడతాయి. నేటి నుంచి మన రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయి. ఇంతవరకు సహనంతో ఓర్పుతో ఉన్నాను. ఇప్పటినుంచి నా పద్ధతి మార్చుకుంటున్నాను. బిజెపి అంటే గౌరవమే, కానీ ఊడిగం చేయలేను. ప్రస్తుతం రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే నేను ఇలాగే ఓర్పుతో ఉండడం మంచిది కాదు. అందుకని ఇప్పటినుంచి నా పద్ధతి మార్చుకుంటున్నాను. వైసీపీలో నీచులు ఎక్కువమంది ఉన్నారు. కొడకల్లారా, సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా అంటూ వైసిపి వాళ్లపై విరుచుకుపడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్. ఇక యుద్ధమే
వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్. ఇక యుద్ధమే

ప్యాకేజీ అంటే చెప్పు తీసుకొని కొడతా అని చెప్తున్నా పవన్. ఇంతవరకు నాలో ఉన్న సహనమే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇక యుద్ధమే అంట. తను ముఖ్యమంత్రి పదవి కోసం పనిచేయడం లేదని ఈ యుద్ధం లో సీఎం పదవి నన్ను వరిస్తే ఇంకా సంతోషమే అని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చాక మొదట అభివృద్ధి చేసి, తర్వాత వీళ్ళ తాట తీయడమే అంటూ విరుచుకుపడ్డారు.

ఇక చావో రేవో రాజకీయాల్లోనే, కానీ సినిమాలు కూడా చేస్తా ఎందుకంటే వీళ్లలాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు కదా పార్టీని నడుపుకోవడానికి అని చెప్పారు. ఈరోజు నుంచి మన రాష్ట్ర రాజకీయం యొక్క ముఖచిత్రం మారబోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి ప్రభుత్వం అంటే నాకు గౌరవం కానీ నా స్థాయిని నేను తగ్గించుకోలేను.

బిజెపి ప్రభుత్వంతో స్నేహం కుదిరిన అంతా బలంగా పనిచేయలేకపోయాం. ఈ విషయం వాళ్లకు నాకు తెలుసు. రౌడీలు రాజ్యాలను ఏలుతు, గుండాలు గదమాయిస్తుంటే నా తీరు నా పద్ధతి ఇక మార్చుకోవాలి అంటూ మండిపడ్డ పవన్. బిజెపి ప్రభుత్వానికి, ప్రధానమంత్రి కి నేను వ్యతిరేకం కాదు. నాకు వాళ్లపై గౌరవం ఉంది. ఎప్పుడూ కలుస్తూ ఉంటాం కానీ వాళ్ల దగ్గర ఊడిగం చేయలేం అని వ్యాఖ్యానించారు.

తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకొని కొడతా అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తనపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కొడకల్లారా ,సన్నాసుల్లారా ,దద్దమ్మల్లారా అంటూ వాళ్ళని తిప్పి కొట్టారు. మంగళవారం ఉదయం మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం అయ్యారు. సీఎం జగన్, ఆ పార్టీ నాయకులు, అప్పటి డిజిపి గౌతమ్ సవాంగ్ చేసిన పనుల గురించి చెప్పడం జరిగింది. రాజకీయాలకు సంబంధించి న, వ్యక్తిగతానికి సంబంధించిన విషయాలపై తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు అనే దాని గురించి తీవ్రంగా మండిపడడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో బూతులు తిట్టని వారిని కాదని, ఎవరైతే బూతులు మాట్లాడుతుంటారో వారి గురించి చెప్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. నిలబెట్టి తోలు తీస్తా కొడకల్లారా అని బెదిరించారు.

తెలంగాణ వాళ్లకు ఉన్న స్ఫూర్తి ఆంధ్రులకు లేదని, తెలంగాణలో ఉన్న అన్ని కులాల వారు నాది తెలంగాణ అనే భావనతో ఉంటారు. ఇలాంటి భావన ఆంధ్రులకు లేదని ఆయన బాధ పడ్డారు…‌.‌ విశాఖ స్టీల్ ప్లాంట్ నాయకులకు చెబుతున్నాను. మీరు నిలబడతానంటే ఇది ప్రైవేటు పరం కాకుండా నేను అడ్డుకుంటాను అని చెప్పారు. నా బిడ్డల భవిష్యత్తు కోసం దాచుకున్న ఎఫ్డీలను రద్దుచేసి మంగళగిరిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశాను. మిగిలిన డబ్బు నుంచి 2021 -2022 లో ఐదు కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా ఇచ్చాను. హుదూత్ తుఫాను, సైనిక బోర్డు, పీఎం కేర్, ఏపీ రిలీఫ్ ఫండ్ కు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అది నుంచి 12 కోట్ల రూపాయలు ఇచ్చాను.

అయోధ్యలో ఉన్న రామాలయ నిర్మాణానికి 30 లక్షలు ఇచ్చాను. మీ పార్టీలకు సొంత నిధులు ఉన్నాయి. జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి జనసేనకు ఉన్న ఐదు బ్యాంక్ అకౌంట్ లో17,58,06,383 కోట్లు ఉన్నాయి. రైతు భరోసా కోసం వచ్చిన విరాళాలు 3.50కోట్లు, నా సేన, నా వంతు కోసం4.32,19,795 విరాళాలు వచ్చాయి. ఆ ఆడబిడ్డ వినుత మీద చేయి వేస్తారా? నాకు భాష రాదు అనుకున్నారా? నేను లండన్ లో న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా? ఇక్కడే మంగళగిరిలో మా నాన్న పని చేశారు. ఎన్నిసార్లు నన్ను తిట్టినా మంచి, మర్యాద, సంస్కారం ఉన్నవాడిని కాబట్టి ఇంతవరకు భరించాను. భీమ్లా నాయకులో చెప్పినట్టు మీకు మంచి ,మర్యాద,మట్టి ,మశానం పనికిరాదు రా మీరు మర్యాద నిలబెట్టుకున్నంతవరకే నేను మర్యాద ఇస్తా.

చొక్కా పట్టుకొని ఇళ్లల్లోంచి బయటికి లాక్కొచ్చి కొడతా, మూడు పెళ్లిళ్లు….. మూడు పెళ్లిళ్లు…చెసుకున్నాడు అంటున్నాడు. మీరు చేసుకోండి ఎవరైనా వద్దన్నారా. నేను నా భార్యలకు కొంత డబ్బు ఇచ్చి, విడాకులు తీసుకున్న తర్వాత వాళ్లకు నాకు కుదరక విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకున్నాను. ఒకరిని పెళ్లి చేసుకొని 30 మంది స్టెప్నీలతో తిరిగే మీరంటే నాకు చెప్పేది. ఇది క్రిమినల్ పాలిటిక్స్, నాది సిద్ధాంతం తో కూడిన రాజకీయం.

దాడులు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ అని గౌతమ్ సవాంగ్ చెప్పారు. నేను కూడా నా బావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటిస్తున్నాను. వైసిపి వాళ్లు మా భారతమ్మ ను అనేసరికి అంత గోల చేశారే, అరే నీచున్నారా! నా కన్నతల్లి అంజనాదేవిని అంత నీచంగా తిట్టించారు. ఇంకా తప్పక అడుగులేస్తున్న నా బిడ్డల్ని తిట్టించారు. మీకు కాలికి నొప్పి వస్తుంది. కానీ నాకు రాకూడదా పద్ధతిగా మాట్లాడితేనే పద్ధతి! ఇక యుద్ధమే.