Cancer Hospital: కర్నూల్ లో క్యాన్సర్ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు పూర్తి

ఆంధ్ర రాష్ట్రం విడిపోయి తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి లేదు. ఈ హాస్పిటల్ త్వరలో కర్నూల్ లో అందుబాటులోకి రానుంది. 17 సంవత్సరంలో ఈ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన వాటినీ కేంద్రం మంజూరు చేయడం జరిగింది. 120 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధుల ను వెచ్చించి హాస్పిటల్ కి సంబంధించిన భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు.

ఏపీ రాష్ట్రంలో వైద్య రంగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సీఎం జగన్ ప్రస్తుతం క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించిన పనులు పూర్తి చేశారు. దీంట్లో భాగంగా కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించిన భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పటివరకు భవన నిర్మాణం మాత్రం పూర్తయింది.

కర్నూల్ లో క్యాన్సర్ హాస్పిటల్ భవన నిర్మాణ పనులు పూర్తి

ఫర్నిచర్, మిగతా వసతులు అన్నీ ఏర్పాటు చేసి త్వరలోనే దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఏపీ గవర్నమెంట్ కృషి చేస్తుంది. క్యాన్సర్ చికిత్సకు కావలసిన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం కృషి చేస్తుంది. మొదట 53.60 కోట్ల పరికరాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తుంది. హై అండ్ రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జరీ ఆంకాలజీ విభాగాలను మొదటగా ఏర్పాటు చేయనుంది.

హై అండ్ డ్యూయల్ ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ ను 30 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనుంది. ఏ హాస్పిటల్ కి సంబంధించిన ఫర్నిచర్ కి అన్ని సౌకర్యాలు త్వరగా సమకూర్చాలని వైద్య విద్య సంచాలకులు ఏ పి ఎం ఎస్ ఐ డి జీ మేనేజింగ్ డైరెక్టర్ కి ప్రతిపాదనలు పంపించడం జరిగింది.

ఈ హాస్పిటల్ ఏర్పాటుకు సంబంధించిన భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వీటిలో అన్ని వసతులు అన్ని ఫర్నిచర్స్, అత్యాధునిక క్యాన్సర్ చికిత్స పరికరాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. త్వరలోనే ఈ పరికరాలన్నీ ఏర్పాటు చేసి క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని, సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకే ఈ పనులను జరుగుతున్నాయని తెలియజేశారు.