సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ ఇలా జరిగింది. సీసీ ఫుటేజ్ వీడియో

మెగాస్టార్ ఫ్యామిలీ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం  అపోలో  హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  మెగాస్టార్ చిరంజీవి,  పవన్ కళ్యాణ్,  అల్లు అరవింద్ అందరూ ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. 

ఇక తాజాగా యాక్సిడెంట్ కు సంబంధించిన మాదాపూర్ పోలీసులు విడుదల చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్ పై వెళ్తున్న సాయిధరమ్ తేజ్   ముందున్న బైక్, ను అలాగే ఆటో టేకోవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బైకు ఒంపు గా తిప్పడం తో ముందు టైర్ స్కిడ్ కావడంతో బండి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. మూడు సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది

ప్రస్తుతం సి సి ఫుటేజ్ వీడియో వైరల్ గా మారింది.  లక్కీగా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తలకు పెద్ద గాయాలు కాలేదు.  దీంతో ప్రాణ భయం తప్పిందని చెప్పాలి.  ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.

#సాయిధరమ్‌తేజ్‌ #SaiDharamTej బైక్ సీసీ కెమెరాలో చిక్కిన స్కిడ్ వీడియో.
Wish him early recovery & Better Health https://t.co/hdg22h5rbs

— Raju Chandupatla (@RajuChandupatla) September 11, 2021