చేపల కర్రీ ఈజీగా ఇంట్లోనే చేసుకునే విధానం.

చికెన్ కర్రీ కంటే చేపల కర్రీని చేయడం చాలా ఈజీగా ఉంటుంది.

చేపల కూర చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వాడటం వల్ల కర్రీ చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు.

చేపను ముక్కలుగా చేసుకునేటప్పుడు మరీ లావుగా కాక సన్నగా కాక మధ్యరకంగా కట్ చేసుకోవాలి.

చేప ముక్కలు కడిగేటప్పుడు కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి నీటితో కడిగితే నీచు వాసన రాకుండా ఉంటాయి.

చేప ముక్కలకు తగినంత కారం, ఉప్పు, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

చేపల కర్రీ చేసేటప్పుడు పెద్ద కడాయి తీసుకోవడం చాలా ముఖ్యం.

మిక్సీ జార్ లోకొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసి మొత్తం మిక్సీ పట్టాలి.

కడాయిలో తగినంత నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసి అందులోనే కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి.

ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి అందులో వేసి ఉల్లిపాయ పేస్ట్ అంతా కలిసేలా నిదానంగా కలుపుకోవాలి.

చేప ముక్కలు బాగా మగ్గి నూనె పైకి తేలేలా వేగనివ్వాలి.

తర్వాత ముక్కలను గరిటతో చిన్నగా విరిగిపోకుండా తిప్పి కొంచెం సేపు చిన్న మంటపై మగ్గనివ్వాలి.

అందులో కొంచెం చింతపండు రసం, ఒక గ్లాస్ నీళ్లు వేసి పది లేదా 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి.

కొద్దిసేపటి తర్వాత పెద్ద గరిట తీసుకొని ముక్కలను నిదానంగా తిప్పి వేగనివ్వాలి.

నీరంతా తగ్గి, ఆయిల్ పైకి తేలితే కొంచెం కొత్తిమీర వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి.

ఈ విధంగా చేయడం ద్వారా హోటల్ స్టైల్ చేపల కర్రీ లాగా ఉంటుంది.

చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు

చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు