జాతీయ ప్రమాణాలతో వైద్య సిబ్బంది
176 PHC ల నిర్మాణం పై దృష్టి పెట్టాలి:ఏపీ సీఎం
డిసెంబర్ కు అని పోస్టులు భర్తీ
అమరావతి: జాతీయ ప్రమాణాలను అనుసరించి బోధనాఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
ఇందులో ఎలాంటి రాజీకి ఆస్కారం లేదన్నారు. జిల్లా ప్రధాన కేంద్రాలు, కార్పొరేషన్లో హెల్త్ హబ్స్ ఏర్పాటు పీహెచ్ సీలు, సిహెచ్ సీలు, ఏరియా ఆస్పత్రిలు, జిల్లా ఆస్పత్రులు, బోధనాఆసుపత్రిలో వైద్య సిబ్బంది నియామకంపై సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ ఆస్పత్రులు నియామకాలు వెంటనే పూర్తి చేయాలని నిర్దేశించారు. గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల క్యాలెండర్ ను రూపొందించామని అధికారులు సీఎంకు తెలిపారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో పోస్టుల భర్తీకి బుధవారం 20 నోటిఫికేషన్ ఇస్తామని… ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ 15 నియామక ఉత్తర్వులు చేస్తామని వెల్లడించారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) లో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ 5 నాటికి, వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) డిసెంబర్ 21, 25 తేదీల మధ్య నియామక ఉత్తర్వులు ఇస్తామన్నారు. కొత్తగా నిర్మించాల్సిన 176 PHC ల నిర్మాణంపై వెంటనే దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. జనవరిలో పనులు ప్రారంభించి తొమ్మిది నెలల లోపు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, CS సమీర్ శర్మ, ఉన్నతాధికారులు శశిభూషణ్, అనిల్ కుమార్ సింఘాల్,ముద్దాడ రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు.