శ్రీవారి భక్తులకు షాక్ ఇచ్చిన టీటీడి


తిరుమల శ్రీవారి భక్తులకు షాక్ ఇచ్చింది టీటీడీ. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోస్ లు వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని టీటీడీ చైర్మన్ వై. వీ సుబ్బారెడ్డి తెలిపారు.

కోవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం టీడీపీ తీసుకున్న నిర్ణయం భక్తులు సహకరించాలని టిటిడి చైర్మన్ విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు విడుదల చేస్తామని తెలిపిన చైర్మన్…. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తామని వెల్లడించారు. రోజుకి ఎనిమిది వేల చొప్పున టికెట్లు విడుదల చేస్తామని తెలిపారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు రెండు రోజుల వ్యాక్సిన్ సర్టిఫికెట్, వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ రిపోర్ట్ చూపించాలని షరతులు పెట్టారు. 26 తేదీ నుంచి తిరుపతి లో ఆఫ్లైన్లో జారీ చేస్తున్న టికెట్లను నిలిపి వేస్తామని అని స్పష్టం చేశారు.