ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ 2021-22

ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ 2021-22. అక్టోబర్ 2021 నెలలో అమలు కానున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు.

“పాలన అనేది దేవుడు ఇచ్చిన అవకాశం. పేదలకు మంచి చేయడానికి ఆ అవకాశం ఇచ్చాడు. ఆ మేరకు ఇప్పటికే ఎన్నెన్నో పథకాలు, కార్యక్రమాలు అనులు చేస్తున్నాం. వాటిని ఇంకా ఏ విధంగా మెరుగుపరచాలని రోజూ ఆలోచిస్తుంటాను” సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

అక్టోబర్ నెలలో

• వైఎస్సార్ రైతు భరోసా 2వ విడత ఆర్థిక సాయాన్నందిస్తారు. • జగనన్న చేదోడు పథకం ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్నందిస్తారు.

నవంబర్ నెలలో

వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణాల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళలకు ఏటా 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని మూడేళ్ల పాటు చెల్లించనున్నారు.

డిసెంబర్ నెలలో

జగనన్న వసతి దీవెన 2వ విడత విద్యార్థుల భోజనం, వసతి ఖర్చులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. జగనన్న విద్యా దీవెన 3వ విడత విద్యార్థుల ఫీజులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. • వైఎస్ఆర్ లా నేస్తం పథకం ద్వారా జూనియర్ లాయర్లకు ప్రతినెలా రూ.5,000 చొప్పున అందించే ఆర్థిక సాయాన్ని ఈ ఏడాదికి సంబంధించి అందిస్తారు.

2022 జనవరి నెలలో

• వైఎస్సార్ రైతు భరోసా 3వ విడత ఆర్థిక సాయాన్నందిస్తారు. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపే తల్లులకు ఈ సంవత్సరానికి గాను 15 వేల రూపాయలు ఆర్థిక సాయం మరియు ల్యాప్ టాప్ కోరిన విద్యార్థులకు ల్యాప్ టాప్ ఇవ్వడం జరుగుతుంది.

• సామాజిక ఫించన్లను నెలకు 2500 రూపాయలు

2022 ఫిబ్రవరి నెలలో

జగనన్న విద్యాదీవెన 4వ విడత విద్యార్థుల ఫీజులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.

గమనిక:

ఇవి కాకుండా నిరంతరాయంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరు ముద్ద, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, పెన్షన్ కానుక మొదలైన పథకాలు అమలవుతాయి.