Amarvathi: గుంటూరు జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య దారుణ హత్యకు గురైన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులను గురువారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ని కలిశారు. ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత ఆమె తల్లిదండ్రులు సీఎం వద్దకు తీసుకొచ్చారు.
ఈ క్రమంలో రమ్య సంఘటనను ఆమె తల్లిదండ్రులు సీఎం జగన్ వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం తమకు 10 లక్షల పరిహారం అందించిన విషయం తెలిపారు. రమ్య కుటుంబానికి పూర్తిగా న్యాయం చేస్తామని సీఎం జగన్ గారు హామీ ఇచ్చారు.
హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ, గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని సీఎం నేడు పరామర్శించారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి, 7 రోజులు చార్జిషీట్లు వేశాం. అంతేకాక రమ్య కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చాం. అంతేకాక తామ సోదరికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లు ఇవ్వాలని సీఎం జగన్ గారు నేడు ఆదేశించారు. ఐదు సెంట్ల స్థలం, ఐదెకరాల పొలం అందించాలని తెలిపారు. మరో పది రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్ తో ఇవ్వాలని తెలిపారు.
అనేక మందికి దిశా యాప్ ద్వారా భద్రత కలుగుతుందని, ఇంకా ప్రతి ఒక్కరు యాప్, చట్టాలపై అవగాహన కల్పించాల్సి ఉంది.