మానవ అక్రమ రవాణాకు చెక్



• ఇందుకోసం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్
• కొత్తగా 10 స్టేషన్లు ఏర్పాటు
• దిశ పోలీస్ స్టేషన్ తో అనుసంధానం
• ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు.

అమరావతి: మానవ అక్రమ రవాణా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది.

జిల్లాకు ఒక మానవ అక్రమ రవాణా నిరోధక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న మూడు స్టేషన్లకు అదనంగా 10 టిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో మానవ అక్రమ రవాణా నిరోధానికి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం కింద గతంలో మార్గదర్శకాలు ఇచ్చింది. జిల్లాకు ఒకటి చొప్పున ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. కానీ TDP ప్రభుత్వం రాష్ట్రంలో లో ఏలూరు, గుంటూరు, అనంతపూర్ జిల్లాల్లో మాత్రమే ఏర్పాటు చేసింది. వాటికి పూర్తి స్థాయిలో సిబ్బంది కేటాయించలేదు. మౌలిక వసతులు కల్పించలేదు గత ప్రభుత్వం.

ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రభుత్వం వన్ మానవ అక్రమ రవాణా పూర్తిగా అరికట్టడం పై దృష్టి సారించింది. పేదరికాన్ని అడ్డుపెట్టుకొని పలు ప్రాంతాల్లో మహిళలు, చిన్న పిల్లలు అక్రమంగా బలవంతంగా అసాంఘిక కార్యకలాపాలు రూపంలో నడుపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఇప్పటికైనా 3 స్టేషన్లకు అదనంగా శ్రీకాకుళం,విజయనగరం, కాకినాడ,విజయవాడ, నెల్లూరు, కడప, చిత్తూరు, ఒంగోలు, కర్నూల్ లో వీటిని ఏర్పాటు చేశారు.

ఒక్క పోలీస్ స్టేషన్ కు ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఐదుగురు కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. మహిళలపై దాడులు, వేధింపులు నిరోధానికి ఏర్పాటుచేసిన దిశా పోలీస్ స్టేషన్ లతో వీటిని అనుసంధానం చేయాలనే యోచనలో ఉంది.
దీనిపై పోలీసు శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.