AP Vinayaka Chavithi News: వినాయక చవితి ఉత్సవాల పై హైకోర్టు సంచలన తీర్పు

వినాయక చవితి ఉత్సవాల పై హైకోర్టు సంచలన తీర్పు

జగన్ సర్కార్ కు ఏపీ హైకోర్టు లో మరొక షాక్ తగిలింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వాలకు లేదని హైకోర్టు తెలియజేసింది.  వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టు లో  పై దాఖలైన విషయం తెలిసిందే.  ఈ విషయంపై బుధవారం మధ్యాహ్నం హైకోర్టు విచారణ చేపట్టింది.  ఈ సందర్భంగా హైకోర్టు ప్రైవేటు స్థలాలలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని అయితే నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవచ్చని పేర్కొంది.   ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవచ్చు హైకోర్టు సూచించింది. 

పబ్లిక్ స్థలాల్లో నిర్వహించే ఉత్సవాల తీరుపై సర్కార్ కోర్టు సమర్థించింది.  పబ్లిక్ స్థలాలలో విగ్రహాలు పెట్టుకుని ఉత్సవాలు నిర్వహించడం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో జగన్ సర్కారు తీసుకున్న చర్యలను సమర్థించింది.  అయితే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన covid 19 నిబంధనలు పాటించాలని ఆదేశాలిచ్చింది. 

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వినాయకుడి చుట్టూ తిరుగుతున్నాయి.  ఉత్సవాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వ తీరుపై పార్టీ నాయకులు, ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల సెప్టెంబర్ 2వ తేదీన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసిపి కార్యకర్తలు నేతలు ఒకే చోట గుంపులు గుంపులుగా చేరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.  అధికార పార్టీ నాయకులకు,  కార్యకర్తలకు లేని కరోనా నిబంధనలు వినాయక చవితి ఉత్సవాలకు వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.