జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కు దరఖాస్తుల ఆహ్వానం: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హత గల వారి నుంచి సాంఘిక సంక్షేమ శాఖ వారు అప్లికేషన్లను ఆహ్వానించారు. QS ర్యాంకుల ప్రకారం ఉన్నత శ్రేణి 200 విదేశీ, విశ్వవిద్యాలయాల్లో PG, PHD, MBBS కోర్సుల్లో చేరడానికి విద్యార్థుల నుండి అప్లికేషన్లను ఆహ్వానించారు.
Intermediate, Degree, PG కోర్సులలో 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ ఉండాలి. MBBS కోర్సులకు నీట్ పరీక్షలో అర్హత తప్పనిసరిగా ఉండాలి.
సంవత్సరాదాయం 8 లక్షల లోపు ఉండాలి. వయస్సు 35 సంవత్సరాలు మించి ఉండకూడదు.
ఆసక్తిగల అభ్యర్థులు జ్ఞానభూమి వెబ్సైట్ లో సెప్టెంబర్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి
అధికారిక వెబ్‌సైట్ www.jnanabhumi.ap.gov.in/