Asus Zenbook 17 Fold: ప్రపంచంలోనే తొలి ఫోల్డ్ లాప్టాప్

Asus Zenbook 17 Fold: ఇప్పటివరకు ఫోల్డబుల్ ఫోన్ ల గురించి చూసాం, విన్నాం. కానీ ఫోల్డ్ లాప్టాప్ గురించి వినలేదు తాజాగా ఆసుస్ కంపెనీ ప్రపంచంలోనే తొలి మడత లాప్టాప్ ను లాంచ్ చేసింది. ఇంటర్నెట్ డెస్క్ సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్ది సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి.

ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్, మరియు ఫోల్డ్ ఫోన్లో వచ్చాయి. తాజాగా ఆసుస్ కంపెనీ ఫోల్డ్ లాప్టాప్ ను మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఆసుస్ జెన్ బుక్ 17 ఫోల్డ్ OLED పేరుతో ఈ ల్యాప్టాప్ ను మార్కెట్లోకి తెచ్చారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డ్ లాప్టాప్ ఇదేనని అసుస్ కంపెనీ పేర్కొంది. దీని ధర ఫీచర్లు చూద్దాం. ఈ ఫోల్డ్ ల్యాప్టాప్ లో 17.3 ఇంచుల థండర్ బోల్ట్ 4k డిస్ప్లే ఉంది.

ఈ ల్యాప్టాప్ ఫోల్డ్ చేసినప్పుడు 12.5 ఇంచుల స్క్రీన్ గా ఉంటుంది. మిగిలిన స్క్రీన్ ను వర్చువల్ కీబోర్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు అదనంగా బ్లూటూత్ కనెక్టివిటీ సాధారణ కీబోర్డు కూడా ఇస్తున్నారు. యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా డిస్ప్లేను రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

Asus Zenbook 17 Fold

12వ జనరేషన్ ఇంటెల్ కోర్ 57 ప్రాసెసర్లను ఇందులో పొందుపరిచారు. ఇంటెల్ ఐ సిరీస్ ఎక్స్ ఈ గ్రాఫిక్ కార్డును కూడా ఉంది. డబుల్ అట్ మొస్ సపోర్టుతో నాలుగు స్పీకర్స్, 5 ఎంపీ AI కెమెరా, మరియు నాలుగు యుఎస్బి- సి పోర్టు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

లాప్టాప్ తో పాటు 500 జీబీ ఎస్ ఎస్ డి ఎక్స్టర్నల్ స్టోరేజ్ ను ఫ్రీగా ఇస్తున్నారు. ఇందులో లాప్టాప్ డెస్క్ టాప్, ల్యాప్ టాప్, మరియు రీడర్, టాబ్లెట్, ఎక్స్టెండడ్ అనే ఐదు స్క్రీన్ మోడ్స్ ఉన్నాయి. మల్టీ స్క్రీన్ ఫీచర్ తో డిస్ప్లే ని ఒకేసారి మూడు స్క్రీన్లుగా ఉపయోగించుకోవచ్చు.

ఈ ల్యాప్ టాప్ ధర సుమారు ₹3,29,000 గా కంపెనీ నిర్ణయించింది. లాప్టాప్ ప్రారంభం ఆఫర్ కింద ₹2,84,290కే పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం నవంబర్ 10 వరకు మాత్రమే అని ఆసుస్ కంపెనీ తెలిపింది. అక్టోబర్ 14 నుంచి ముందస్తు ప్రారంభం అవుతుంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి ₹27,100 విలువైన ఫ్రీ వారంటీని కంపెనీ ద్వారా పొందవచ్చు.

Asus Zenbook 17 Fold