ఏథర్ కొత్త మోడల్ ఫీచర్స్ ఇవే: ఏథర్ పాత మోడల్ తో పోలిస్తే కొత్త మోడల్ లో చాలా అప్డేట్స్ జరిగాయి. దీని బ్యాటరీ కెపాసిటీ 2.9 kwh నుండి 3.7 kwh కు పెంచారు. బ్యాటరీని పెంచారు అంటే దాని యొక్క రేంజ్ కూడా పెంచడం జరిగింది. 116km నుండి 146km దీని యొక్క రేంజ్ ను పెంచారు. 146km రేంజ్ రావాలి అంటే 20 నుండి 25 స్పీడ్ మాత్రమే వెళ్ళాల.
ఏథర్ స్కూటీలో సైడ్ మిర్రర్స్ gen 2 కంటే gen 3 మిర్రర్ సైజు పెంచడం జరిగింది. దీనిలో టైర్స్ యొక్క సైజును 100/80, 12inch ఉంది. దీనిలో లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. దీని యొక్క అక్లేరేషన్ 3.3 సెకండ్స్ ఉంది.
దీని యొక్క టాప్ స్పీడ్ 80km/h ఉంది. దీనిలో eco mode లో 105km/h స్పీడ్ వెళుతుంది.ride mode లో 70km-85km కు పెంచారు. Sports mode లో 60km-75km కు పెంచారు. Warp mode లో 50km- 65km కు పెంచారు. దీని యొక్క బ్యాటరీని ఫుల్ చార్జ్ చేయాలంటే 5 గంటల సమయం పడుతుంది. ఏథర్ 450x gen 3 విలువ 1,52,000 ఉంది.