Amazon Great India Festival Sale: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫారం అయినటువంటి అమెజాన్ మళ్ళీ సేల్స్ తీసుకొస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనే పేరుతో సేల్ నిర్వహించనుంది. ఈ నెలలోనే ఈ సేల్స్ ఉండనున్నాయి. ఈ సేల్స్ లో హెడ్ ఫోన్స్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ లు, ట్యాబులు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లతో పాటు చాలా ప్రొడక్ట్స్ లపై మంచి డిస్కౌంట్ ఉండనుంది.
బ్యాంకు కార్డు ఆఫర్ ద్వారా తగ్గింపును కూడా పొందవచ్చు. నో కాస్ట్ ఇఎంఐ ఎక్స్చేంజ్, ఆఫర్లు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ సేల్ డేస్ ను కూడా ప్రకటించగా ఇప్పుడు అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ సేల్స్ ను నిర్వహించనున్నట్లు తెలిపింది. అమెజాన్ సేల్స్ లో గాడ్జెట్స్, ఫోన్స్ ఎలక్ట్రానిక్స్ తో పాటు చాలా ప్రొడక్ట్స్ పై కార్డ్ ఆఫర్లు, డిస్కౌంట్లు, వంటి డీల్స్ ఉన్నాయి.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను త్వరలోనే నిర్వహించినట్లు అమెజాన్ తెలిపింది. తేదీలను ఇంకా వెల్లడి పరచలేదు కానీ అయితే మరో రెండు వారాల్లోనే ఈ సేల్ ఉంటుంది. మరొక మూడు నాలుగు రోజులలోనే సేల్ తేదీలను అమెజాన్ ప్రకటించనుంది. ఇప్పటికే సేల్ కు సంబంధించిన వెబ్సైట్లో ప్రత్యేకమైన పేజీని క్రియేట్ చేసి కొన్ని డిస్కౌంట్లను, డీల్స్ ను అమెజాన్ టీజ్ చేస్తోంది.
గ్రేట్ ఇండియా ఫెస్టివల్లో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఇవ్వనునట్లు ఆమెజాన్ పేర్కొంది. ఐక్యూ, సామ్సంగ్ ఎం సిరీస్ మొబైల్స్ అమెజాన్ భారీగా ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది. ఒప్పో, వివో, రియల్ మీ, Xiaomi, రెడ్మీ, వన్ ప్లస్ లతోపాటు మిగిలిన కంపెనీ స్మార్ట్ ఫోన్లో కూడా ఆఫర్లతో అందుబాటులోకి వస్తాయి. ట్యాబ్ లు, స్మార్ట్ వాచ్లు, లాప్ టాప్ లు, టి డబ్ల్యూ ఎస్ ఇయర్ ఫోన్స్ వంటి ప్రోడక్ట్ లపై 75 శాతం వరకు ఆఫర్లు ఉంటాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ లో స్మార్ట్ టీవీ లపై 60 శాతం వరకు ఆఫర్లు ఉంటాయి. వాషింగ్ మిషన్లపై 60 శాతం తగ్గింపు ఆఫర్లు ఉంటాయని అమెజాన్ పేర్కొంది. వన్ ప్లస్, LG, Sony, Xiaomi తోపాటు చాలా బ్రాండ్స్ హోమ్ అప్లయన్సెస్ డిస్కౌంట్ ధరలకు లభించే అవకాశం ఉంటుంది.
అమెజాన్ కు చెందిన ఫైర్ టీవీ, అలెక్స్ కిండిల్ ప్రోడక్ట్ లపై కూడా భారీ ఆఫర్లను ఉండే అవకాశం ఉంది. కాగా ఫ్లిప్కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ ను కూడా ప్రకటించింది. డీల్స్, డిస్కౌంట్ వివరాలు క్రమంగా వెల్లడిపరుస్తోంది. ఈ పండుగ సీజన్లో ఈ రెండు ఈ కామర్స్ సంస్థలు పోటీపడి ఆఫర్లతో ప్రోడక్ట్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.